సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

May 11,2024 15:58 #ap election, #Kakinada, #Polling
  • పెద్దాపురం నియోజకవర్గంలో 2,15,095 మంది ఓటర్లు

ప్రజాశక్తి – పెద్దాపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి జె సీతారామారావు అన్నారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,15,095 మంది ఓటర్లు ఉన్నారన్నారు.వీరిలో పురుషులు 1,05,788 మంది,స్త్రీలు 1,09,294 మంది,ట్రాన్స్ జెండర్ లు 13 మంది ఉన్నారన్నారు.నియోజకవర్గ పరిధిలో 201 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు.1206 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారన్నారు.ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పి ఓ,ఏ పీ ఓ లతోపాటు నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు.ఈనెల 13 న జరిగే ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటుని వినియోగించుకోవాలన్నారు.

➡️