రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం : మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం అని, నిందితులపై చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్‌ సభలకు ఆయన కూలి మీడియా, నీలి మీడియా తప్ప మిగతా మీడియా రాకూడదా ? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాని జగన్‌ రెడ్డి కక్షతో కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు. వైసిపి పాలన వైఫల్యాలు, వైసిపి నేతల అవినీతిని వెలికితీసిన వారిపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడు ఘటనలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యలక్ష్మి కోరారు.

➡️