సచివాలయంతో మెరుగైన సేవలు

Mar 7,2024 00:20

ప్రజాశక్తి – చీరాల
సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండలంలోని తోటవారిపాలెంలో రూ.40లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలో రూ.3.55కోట్లతో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. వైసిపి ఇంచార్జీ కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఒ శోభారాణి, పంచాయితీ రాజ్ డిఈ శేషయ్య, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, వైసిపి జిల్లా కార్యదర్శి బండారు శివపార్వతి, పిఎసిఎస్‌ చైర్మన్ బోయిన కేశవులు, పర్వతనేని శ్రీనివాసరావు, బుర్ల మురళి, గొలకారం సాంబశివరావు, డేగల నాగేశ్వరరావు, గుమ్మడి చిన్న బాబు, అందే సుబ్బారాయుడు, ఎపీఎం సుబ్బారావు పాల్గొన్నారు.

➡️