చీరాలలో రాస్తారోకో..

Jan 20,2024 17:26 #Bapatla District
anganwadi workers strike 40th day mass org rastaroko chirala a

అంగన్వాడీలపై ఎస్మాను వ్యతిరేకిస్తూ సిఐటియు నాయకులు నిరసన

ప్రజాశక్తి – చీరాల : చీరాలలో 39రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ ధర్నా చేపట్టిన అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం చాలా బాధాకరమైన విషయమని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణా కన్నా అధికంగా వేతనం ఇవ్వాలని కోరారు. ఆ హామీని నెరవేర్చమని కోరుతూ ఈరోజు రోడ్డు ఎక్కారని అన్నారు. అంతేకాక సమ్మెను విరమించి విధుల్లోకి హాజరు కాకుంటే విధుల్లో నుండి తొలగిస్తామని షో కాజ్ నోటీస్ లు జారీ చేయడం అప్రజా స్వామికమని అన్నారు. ఇప్పటికైనా వారి కోరికను తీర్చి పుణ్యం కట్టుకోండని కోరుతున్నామని తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సిఐటీయు ఆధ్వర్యంలో ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సిఐటీయు అధ్యక్షులు నలతోటి బాబూరావు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

➡️