సిఎఎ మైనార్టీల ఉనికికి ప్రమాదం

Mar 15,2024 16:05 #Bapatla District

ప్రజాశక్తి – రేపల్లె : ముస్లిమ్ మైనార్టీల ఉనికికి ప్రమాదం తీసుకువచ్చే (సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం నింబందనలను తక్షణమే వెనక్కీ తీసుకోవాలి సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ డిమాండ్ చేశారు. రేపల్లె ఓల్డ్ టౌన్ పెద్ద మసీదు వద్ద సిఎఎ నీ తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ సిపిఎం పార్టీ,మరియు లౌకిక పరిరక్షణ వేదికగా ప్రచారం నిర్వహించ్చారు. అనంతరం మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం విషయంలో 2014 ముందు ఈ దేశంలోకి వచ్చిన ముస్లిం ఇతరులుకి అంటే హిందువులు, సిక్కులు,బౌద్ధుల,జైనులు,పార్సీలు, క్రైస్తవులు కి పౌరసత్వం కల్పిస్తామని, ముస్లింలుగా ఉన్న బాంగ్లాదేశ్,పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుండి వలస వచ్చినా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమని నిబంధనలను నోటి పై చేయడమంటే ముస్లిముల ఉనికికి ప్రమాదం, దేశంలో రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కులు ఇతర హక్కులు పై దాడి చేయటంమే అన్నారు. గతంలో దేశంలో 11 సంవత్సరాలు నివసించాలని నిబంధన ఉండేది,దేశంలోనే పుట్టినా అందరికీ పౌరసత్వం వచ్చేది.2019లో తీసుకొచ్చినా పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టడంతో అప్పుడు వెనక్కి తగ్గి,ఎన్నికల ముందు సిఎఎ తీసుకురావడం ఎన్నికల్లో భాగంగా ప్రజల మధ్య చీలికలు తీసుకురావడమే అని విమర్శించారు. మైనార్టీలను ఉద్దరిస్తానని రోజూ ప్రకటనలు ఇచ్చే రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో మైనార్టీలపై మెజార్టీ మతస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలను సృష్టించాలనుకున్న బిజెపితో కలిసి తెలుగుదేశం లౌకికవాదం ఎలా కాపాడుతుందో ప్రజలకు చెప్పాలి,బిజెపి దురాగతాలను ప్రశ్నించకుండా వైసిపి మైనార్టీలను ఎలా రక్షిస్తుందో చెప్పాలన్నారు. అపుడే రాష్ట్రంలో మైనార్టీలా ఓట్లు అడగాలి,రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం,మతం,రంగు, జాతి, ప్రాంతం,భాష అధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదు,కానీ సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తోంది.రాజ్యాంగంలోని 19వ అధికరణం మతపరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకు పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘనా అవుతుంది. దశాబ్దాలుగా మతమపరమైన హింసను ఎదుర్కొన్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారు, పొరుగుదేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను మానవతా దృష్టితో ఆదుకునేందుకే ఈ చట్టం తెచ్చినట్లయితే కేవలం మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చిందో తెలపాలి,మయన్మార్‌లో మైనార్టీలైన రొహింగ్యా ముస్లిములు,శ్రీలకంలో హిందువులు, క్రైస్తవ తమిళులు తీవ్రమైన హింసాకాండకు గురయ్యారని వారిని ఈ చట్టంలో చేర్చకపోవటం వెనక కుట్ర ఉంది.వీటన్నిటినీ పరిశీలిస్తే దీనివెనుక మానవత లేదని, రాజకీయవ్యూహంతో ప్రజలని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తోందని అర్థమవుతుంది. కావున రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేస్తున్న సిఏఏ నోటిఫికేషన్ నీ తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరుతూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికగా దేశంలొ ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె పట్టణ నాయకులు కే.ఆశీర్వాదం కేవీ. లక్ష్మణరావు, బి.ఆగస్టిన్, వై.నవీన్, ఓల్డ్ టౌన్ మసీద్ ముస్లిం పెద్దలు,యువకులు పాల్గొన్నారు.

➡️