వైసిపి నుండి టిడిపిలో చేరికలు

Nov 23,2023 00:39

ప్రజాశక్తి – చీరాల
వైసిపి అరాచక పాలనతో విస్తుపోయిన ప్రజలు టిడిపి తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాబోయే ఎన్నికలలో ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు. పట్టణంలోని 27, 28వార్డులైన దండుబాట, విటల్ నగర్, హరిప్రసాద్ ప్రాంతాలకు చెందిన 15కుటుంబాలు కొండయ్య ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ టిడిపిలో చేరినట్లు తెలిపారు. ప్రజలను భాగస్వాంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికలలో టిడిపిని గెలిపించాలని అన్నారు. అలపన రమణమ్మ భర్త సూర్యం ఆధ్వర్యంలో వాడాడి తిరుమల, నాయని సునీత, అలపన బోడెమ్మ, బూర గౌరి, దల్లి సాయి, నాయని లక్ష్మి, దల్లి మల్లేష్, అలపన పైడెమ్మ, దల్లి రెడ్డి, నిమ్మ జగదీష్, దల్లి రాధాకృష్ణ, దువ్వు వరలక్ష్మి టిడిపిలో చేరారు.

➡️