భక్తులకు టిడిపి అన్నదాం

Nov 27,2023 23:45

ప్రజాశక్తి – చీరాల
కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం సముద్ర స్నానాల సందర్భంగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి ఎంఎం కొండయ్య సముద్ర స్నానాలకు విచ్చేసిన భక్తులకు వాడరేవు, రామాపురం నందు కేసరి, పులిహోర ప్రసాదములు అందించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు డేటా నాగేశ్వరరావు, రంగరాజు, ఎరిపిల్లి గోవిందు, గరికన కాశీరావు, కె దుర్గాప్రసాద్, ఓసిపిల్లి తాతారావు, కె పెంటయ్య, పిక్కి కోదండమ్, బొందు గురవయ్య, డి కోదండం, ధోని కనకరాజు, గోసాల శ్రీను, గరికిన చిన్న, కర్పూరపు సుబ్బలక్ష్మి, ఆకురాతి సుజాత, పడవల లలిత, పొట్టేటి రాజేశ్వరి, బోయిన శ్రీనివాసరావు, శింగరేసు కాళిదాసు, కౌతరపు జనార్ధనరావు, పాకల పాండు, నున్న జ్యోతిమైరామ్, నాసిక ఆనంద్, షేక్ సుభాని, షేక్ రజాక్, తోట సాంబశివరావు పాల్గొన్నారు.


బాపట్ల : కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు సూర్యలంక బీచ్‌కు వచ్చిన పర్యాటకులకు టిడిపి ఇన్‌చార్జి వేగేశన నరేంద్ర వర్మ, జనసేన ఆధ్వర్యంలో సోమవారం అల్పాహారం ఏర్పాటు చేశారు. సూర్యలంక సముద్ర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన 50వేల మంది భక్తులకు జనసేన, టిడిపి సంయుక్తంగా అల్పాహారం అందజేసినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి సూర్యలంకకు చేరే పర్యాటకుల ఆకలి తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని నరేంద్ర వర్మ తెలిపారు. కార్యక్రమంలో జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️