సింథైడ్ ఫ్యాక్టరీని మూయించిన గ్రామస్తులు

ప్రజాశక్తి – మేదరమెట్ల
స్థానిక సింథైట్ మిర్చి ఫ్యాక్టరీని గురువారం గ్రామస్తులు ముగించారు. ఫ్యాక్టరీ వల్ల కారు రావడంతో చిన్న పిల్లలు, వృద్దులు ఆరోగ్య రీత్యా బాధపడుతున్నారని, ఫ్యాక్టరీని మూసివేయాలని గతంలో కూడా ఎన్నోసార్లు గ్రామస్తులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరారు. యాజమాన్యం కారు రాకుండా తగు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఊరుకున్నారు. అయితే నిన్న రాత్రి భయంకరమైన కారు వల్ల వాకింగ్‌కు వెళ్లిన వృద్ధులు పడిపోయారు. దీంతో బుధవారం ఉదయాన్నే గ్రామస్తులంతా కలిసి ఫ్యాక్టరీని మూసివేయాలని, ఈ ఫ్యాక్టరీ వల్ల అనేక జబ్బులు వస్తూ ఉన్నాయని డీజిఎం మహేంద్రతో మాట్లాడారు. వెంటనే స్పందించిన డీజిఎం తమ యజమాన్యంతో మాట్లాడుకుని ఫ్యాక్టరీని మూస్తున్నట్లు ప్రకటించి నోటీస్ బోర్డులో కూడా పెట్టించారు. ఆ తర్వాత గ్రామస్తులు ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో రెండు చోట్ల మూడు అడుగుల కుంటలు తీయించారు. వాహనాలు, వ్యక్తులు ఫ్యాక్టరీలోకి వెళ్ళకుండా చర్యలు చేపట్టారు.

➡️