ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు : చైర్మన్ జంజనం

Nov 23,2023 00:36

ప్రజాశక్తి – చీరాల
వైసీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇంచార్జీ కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు అధ్యక్షతన పట్టణంలోని క్లస్టర్-2లోని హైయర్ పేట సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. వార్డులో అర్హులైన లబ్ధిదారులుకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. వైసిపి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీస్ పట్టణ ఇంచార్జీలు దాసరి రామకృష్ణ, కోలా శివ, వైసిపి జిల్లా కార్యదర్శి శిఖా సురేష్, వాసిమల్ల వాసు, కౌన్సిలర్‌ గోలి స్వాతి, మల్లెల లలిత రాజశేఖర్, చుక్కా నాగలక్ష్మీ, బత్తుల అనిల్, మించాల సాంబశివరావు, గోలి జగదీష్, షేక్ సుభాని, షేక్ మహిమూద్, యాతం మేరీ బాబు, మామిడాల సుబ్బారావు, చిలుకోటి శ్రీనివాసరావు, శవనం సామ్యేల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

➡️