పేదల సంక్షేమానికి కృషి : బూచేపల్లి

ప్రజాశక్తి-ముండ్లమూరు : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పులిపాడు, పులిపాడు తాండ, ఉల్లగల్లు గ్రామాల్లో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందినితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఆదరిస్తే దర్శి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తుంటే ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నట్లు తెలిపారు. పింఛను నగదు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తే తెచ్చుకొనేందుకు వృద్ధులు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆ నెపాన్ని వైసిపి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సారత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వ్యవస్థ కొనసాగాలంటే జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లక్ష్మిరెడ్డి, మాజీ సర్పంచులు అప్పిరెడ్డి, రామానాయక్‌, వైసిపి సుబ్బారెడ్డి, రమణారెడ్డి, బిక్షల్‌రెడ్డి నారాయణరెడ్డి, ఆయా గ్రామాల వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️