రూ.2కోట్లతో టిటిడి కళ్యాణ మండపం

Nov 24,2023 16:39
రూ.2కోట్లతో టిటిడి కళ్యాణ మండపం

రూ.2కోట్లతో టిటిడి కళ్యాణ మండపం- పబ్లిక్‌ కాంట్రిబ్యూషన్‌ రూ.40 లక్షలు అందించిన మంత్రి ఆర్కేరోజాప్రజాశక్తి-నగరి: మండలంలోని బుగ్గ అగ్రహారంలో రూ. 2కోట్ల వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నట్లు మంత్రి ఆర్కేరోజా తెలిపారు. గురువారం అలిపిరి శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణశాలలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహా విశేష హౌమంలో పాల్గొన్న ఆమె కళ్యాణ మండపం నిర్మాణానికి టీటీడీ నిబంధనల మేరకు చెల్లించాల్సిన 20 శాతం పబ్లిక్‌ కాంట్రిబ్యూషన్‌ రూ.40 లక్షల రూపాయలను టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ నగరి పరిసరప్రాంతాల ప్రజల చిరకాల కోరిక టీటీడీ కళ్యాణ మండపమన్నారు. అది త్వరలో నెరవేరుతుందన్నారు. నిర్మాణానికి రూ.2కోట్లు టీటీడీ మంజూరు చేసిందని అందులో నిబందల మేరకు చెల్లించాల్సిన 20 శాతం పబ్లిక్‌ కాంట్రిబ్యూషన్‌కు కూడా చెల్లించడం జరిగిందన్నారు. త్వరలో టెండర్లు పిలుస్తారని అది అయిన వెంటనే నిర్మాణం ప్రారంభమౌతుందన్నారు. 500 మంది కూర్చునేలా మ్యారేజి హాలు, ఒకసారికి 200 మంది కూర్చునేలా డైనింగ్‌ హాలు దానికి అనుబంధంగా కిచెన్‌, స్టోర్‌ రూము, వరుడు, వధువులకు అటాచ్డ్‌ బాత్రూమ్‌ ఉండేలా కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుందన్నారు. బుగ్గ కాశీ విశ్వేశ్వరాలయానికి సమీపంగా నిర్మిస్తున్నందున నగరి, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా తక్కువ వ్యయంతో పెళ్లిల్లు చేసుకునేసౌకర్యం కలుగుతుందన్నారు. పార్కింగ్‌కు ఎలాంటి సమస్య ఉండదని, ఆలయం, శంకరమఠం లాంటివి పక్కన ఉన్నందున విచ్చేసేవారికి బసతో పాటు అన్నివిధాలుగాను సౌకర్యగా ఉంటుందన్నారు. ఇప్పటికే వడమాలపేట మండలం అప్పలాయ గుంటలో 7 కోట్ల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మించడం జరిగిందన్నారు. పుత్తూరులో టీటీడీ కళ్యాణ మండపం నవీకరించామన్నారు. రూ. 1.85 కోట్ల వ్యయంతో షాదీ మహల్‌ నిర్మించడం జరిగిందన్నారు.

➡️