మంగళగిరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 13:01 #CPM wide campaign, #Mangalagiri

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పేదల సమస్యల కోసం నిరంతర పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్న శివశంకరరావు అన్నారు. శనివారం మంగళగిరి పట్టణంలోని పార్క్‌ రోడ్‌, అంబేద్కర్‌ సెంటర్‌, దేవస్థానం రోడ్డు, రెండవ వార్డు, కంటే వారి వీధి, శివాలయం వెనుక వీధి, పానకాల స్వామి మెట్ల రోడ్డు, ఘాట్‌ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి, ఇందిరానగర్‌, ఇప్పటం రోడ్డు, ఆంజనేయ కాలనీ, వీవర్స్‌ కాలనీ, కప్పు రావు కాలనీలో రోడ్‌ షో కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియా బ్లాక్‌ వేదిక తరపున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జన్న శివశంకరరావు, గుంటూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌ షో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జొన్న మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీలే అని అన్నారు. అందులో సిపిఎం అగ్రభాగాన ఉండి పోరాటం చేసిందని అన్నారు. కొండ పోరంబోకు ప్రాంతాల్లో ఇల్లు చేసుకున్న నివాసం ఉంటున్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు సమస్య పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పనిచేసింది కమ్యూనిస్టు పార్టీలు లేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించుకొని పార్లమెంటుకు, శాసనసభకు పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ప్రజలపై భారాలు వేసే పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. వైసిపి, టిడిపి పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ ఎస్‌ చెంగేయ, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్‌, పట్టణ నాయకులు ఎం చలపతిరావు, కే ఏడుకొండలు, ఆంధ్ర ప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకఅష్ణ, సిపిఎం నాయకులు గోలి దుర్గాప్రసాద్‌, ఈ విజయలక్ష్మి, , ఈ కాటమరాజు, బి స్వామినాథ్‌, ఎస్‌ కోటేశ్వరావు, షేక్‌ ఖాసీం వలి, ఏ నికల్సన్‌, యశ్వంత్‌, ఎం కిరణ్‌, నవిత, షేక్‌ కాసిం, ఎస్‌ నరసింహారావు, సిపిఐ నియోజవర్గ నాయకులు పి నాగేశ్వరావు, జాలాది జాన్‌ బాబు, , కే నరసింహారావు తదితరులు పాల్గన్నారు. రోడ్‌ షో కార్యక్రమంలో తీన్మార్‌, ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గేయాలను ఆలపించారు. సిపిఎం అభ్యర్థి జన్న శివశంకరరావు పూలమాలవేసి హారతి ఇచ్చి స్వాగతం పలికారు.

➡️