దామోదర సంజీవయ్య ఆదర్శప్రాయుడు

ప్రజాశక్తి – వేంపల్లె స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఆదర్శ ప్రాయుడని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో దామోదర సంజీవయ్య 52వ వర్థంతిని కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ సంజీవయ్య కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్రానికి, దేశానికి ఎంతో సేవ చేశారని ప్రశంసించారు. కాంగ్రెసు పార్టీ జాతీ య అధ్యక్షుడిగా పార్టీని పటిషం చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 2వ ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య 25 నెలలు పని చేశారన్నారు. నెహ్రూ, శాస్త్రి, ఇందిరమ్మ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా కూడా ఆయన పని చేసినట్లు తెలిపారు. పేద కుటుంబంలో పుట్టి తుది శ్వాస వరకు నిరాడంబరంగా, నిజా యితీగా ఉన్నారన్నారు. 38 సంవత్సరాల చిన్న వయసులో దేశం లోనే తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సంజీవయ్య జీవించింది కేవలం 51 సంవత్సరాలే అయినా రాష్ట్ర, దేశ రాజ కీయాలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు ఉత్తన్న, రామకృష్ణ, అమర్‌, వినరు పాల్గొన్నారు.

➡️