అల్లర్లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు

 ఈపూరు: సార్వత్రిక ఎన్నికల అనంతరం గ్రామాలలో గొడవలను కట్టడి చేసేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మండలంలోని కొచ్చర్లలో ఆదివారం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వ హించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టి గ్రామంలో మారణాయుధాలు, నాటు బాంబులు ఏమైనా ఉన్నాయే మోనని గ్రామంలో సోదాలు చేశారు. కార్డెన్‌ సెర్చ్‌ నిర్వ హిస్తున్న సమయంలో సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహ నాలు స్వాదీన చేసుకొని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ ప్రజలు అల్లర్లకు పాల్పడి జీవి తాలు నాశనం చేసుకోవద్దని,యువత రాజకీయ అల్లర్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఓటు వినియోగించు కోవడం పౌరుడి ప్రాధమిక హక్కు అయితే రాజకీయ అల్లర్లకు దూరంగా ఉండటం నైతిక హక్కుగా ప్రతిఒక్కరు భావిం చాలని పోలీసులు సూచించారు. తనిఖీలలో వినుకొండ రూరల్‌ సీఐ సుధాకర్‌,ఈపూరు ఎస్‌ఐ మహమ్మద్‌ ఫిరోజ్‌, బొల్లాపల్లి ఎస్‌ఐ చెన్నకేశవరావు, అడిషనల్‌ ఎస్‌ఐ మోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పలు చోట్ల కార్డెన్‌ సెర్చ్‌

సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లి పట్టణంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వ హించారు. పట్టణంలోని 23 వార్డు బీబీనగర్‌ లో పోలీసులు ఆదివారం కార్టన్‌ సెర్చ్‌ చేశారు. కాలనీలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ముప్పాళ్ళ మండలం మాదల తొండపి గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. మాదాల లో పెట్రోల్‌ బాంబులు స్వాదీనం చేసుకున్న నేప థ్యంలో పట్టణంలో బీబీ నగర్‌ లో పట్టణ సిఐ శ్రీని వాసరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి మారణాయుధాలు తదొరకలేదని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో పట్టణ ఎస్‌ఐ లు సత్యనారాయణ , సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

హుస్సేనగరంలో .. పెదకూరపాడు మండలంలోని హుస్సే నగరంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ఆ గ్రామంలో గొడ వలు జరిగాయి. ఈ క్రమంలో సెర్చ్‌ నిర్వహించినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.

➡️