ఈవిఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

Jun 29,2024 11:04 #East Godavari

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈవిఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎఫ్ సిఐ గోడౌన్ లో ఉన్న ఈవిఎమ్ గోడౌన్ సందర్శించారు. ఈ సంధర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ఈవిఎమ్ గోడౌన్ నుంచి సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఈ వి ఎమ్ యూనిట్స్ ను ఏప్రియల్ 12 న పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన, ఏప్రియల్ 13 అసెంబ్లి నియోజక వర్గాల కు ఈవిఎమ్ యూనిట్ ( బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్స్)  అత్యంత భధ్రత మధ్య అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు చెయ్యడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు తిరిగి ఆయా యూనిట్స్ సురక్షితంగా ఈవిఎమ్ గోడౌన్ తరలించడం జరిగిందన్నారు. వాటిని పార్లమెంటు, అసెంబ్లి సిగ్మెంట్ వారీగా వాటికి కేటాయించినా గదుల్లో భద్రపరచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవిఎమ్ గోడౌన్ పరిశీలించినట్లు తెలియ చేశారు. కలెక్టర్ వెంట ఈవిఎమ్ నోడల్ అధికారి, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️