పాత్రికేయులకు “రచనా రత్న” పురస్కారాలు

Apr 10,2024 12:56 #East Godavari

ప్రజాశక్తి-కడియం : మండల కేంద్రమైన కడియం శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది పురస్కారాలు అందించారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక మినర్వా పబ్లిక్ స్కూల్లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన సామాజిక విశ్లేషకులు మలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ సాహిత్యం, జర్నలిజం అనేవి ప్రజలను చైతన్య పరుస్తాయన్నారు. ఏపిడబ్ల్యూజేయు రాష్ట్ర కార్యదర్శి మండేల శ్రీరామ మూర్తి, మండల విద్యాశాఖ అధికారి వై నాగేశ్వరరావు మాట్లాడుతూ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి కళాశాల సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. కళాసేవా సమితి అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్రీనివాసరావు నేతృత్వంలో సమాజ అభివృద్ధికి అనేక రచనలు చేస్తున్న కొండ్రెడ్డి శ్రీనివాస్, గొడవర్తి శ్రీనివాస్, గొల్లపల్లి సత్యనారాయణ లను రచనారత్న పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.

➡️