ఈసీ వెంటనే పోలింగ్‌ పరిస్థితిని చక్కదిద్దాలి : చంద్రబాబు

అమరావతి : ఈసీ వెంటనే పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నేడు పల్నాడు సహా ఎపిలో పలుచోట్ల హింసాత్మక ఘటనలను చంద్రబాబు ఖండించారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఉదయం నుంచి పరిస్థితిపై తాము ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిపారు. అయినా శాంతి భద్రతలు కాపాడలేకపోయారన్నారు. ఈసీ వెంటనే పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

➡️