జగన్‌వి భూములను కొల్లగొట్టే ప్రయత్నాలు

May 6,2024 17:50 #TDP
  • తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి
    నూజివీడు : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా భూ యజమానుల హక్కులను హరించేందుకు సిఎం వైఎస్‌ జగన్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. ల్యాండ్‌టైటిలింగ్‌ యాక్ట్‌పై చర్చించేందుకు నూజివీడులోని న్యాయవాదులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్‌ చేసిన సమయంలోనే జగన్‌ కుతంత్రం అమలుచేశారన్నారు. సెప్టెంబర్‌ 2022 గెజిట్‌లో, టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వ అధికారులను తొలగించి అక్టోబర్‌ 2023లో గెజిట్‌ను సవరించారన్నారు. ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మార్చేసాశారన్నారు. అంటే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌గా వైసీపీ నేతలని పెట్టి, మన భూములు, ఇళ్లు లాగేసుకునే కుట్ర పన్నారన్నారు. ఎంత భయంకర కుట్ర పన్నారో చూసారా?అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టంలోని అంశాలను పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. రూరల్‌లో ఎన్నికల ప్రచారంనూజివీడు : నూజివీడు మండలం మర్రిబంధం, సీతారాంపురం గ్రామాల్లో నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గని సారధి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూటమి మేనిఫెస్టో చూసి జగన్మోహన్‌ రెడ్డి భయపడ్డాడని, ఓటమి ఖాయమని జగన్‌ ఇచ్చిన దానికంటే 10 నుంచి 15 శాతం సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తామని సారధి వివరించారు. నూజివీడు నుంచి స్థానిక ఎమ్మెల్యేను మూడుసార్లు గెలిపించారనీ, ఏమైనా అభివృద్ధి చేశాడా? అని ప్రశ్నించారు. అతనిని మూడుసార్లు గెలిపించారు ఏ ఒక్క పనైనా చేశారా అని అడిగారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, ఆయా పార్టీల అభిమానులు తదితరులు పాల్గన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం మద్దతునూజివీడు పట్టణంలోని రాయల్‌ గ్రాండ్‌ ఫంక్షన్‌ హాల్‌లో డాక్టర్లతో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారధి మాట్లాడారు. గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు మాట్లాడుతూ సారధి విజయం కోసం పనిచేస్తామని హామీఇచ్చారు. ఆగిరిపల్లి మండలానికి చెందిన ఎసై పేట గ్రామానికి చెందిన ఒరుగు పంగిడయ్య టిడిపిలోకి చేరారు. నూజివీడు నియోజకవర్గ కూటమి బలపర్చిన అభ్యర్థి కొలుసు పార్థసారధి టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆగిరిపల్లి పట్టణంలో జరిగిన ర్యాలీలో కె.పి.సారధి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వడ్డెర సంఘం యూత్‌ అధ్యక్షులు డేరంగుల రవీంద్ర, తిరుపతి తిరుపతరావు పరుగు స్వామి, చింతా శీను, నాగేశ్వరావు తదితరులు పాల్గన్నారు.
➡️