ఓటు నమోదుకు తుది గడువు 14

Apr 4,2024 13:31 #Eluru district

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఓటు పొందేందుకు ఏప్రిల్ 1,2024 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని, ఈ నెల 14వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకోవాలని ఉంగుటూరు ఆర్వో ఖాజావలి చెప్పారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని, ప్రస్తుతానికి ఇదే చివరి అవకాశం అని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో 18 సంవత్సరాలు దాటిన భారత పౌరులందరికీ ఓటుహక్కు మన రాజ్యాంగం కల్పిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఆ తరువాత ధరఖాస్తు చేసినా, ఈ ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం ఉండదన్నారు. కొత్త ఓటు కోసం, లేదా చిరునామా మార్పు కోసం ఈ నెల 14వ తేదీలోపల వచ్చే ధరఖాస్తులను మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. వాటిని పదిరోజుల్లోగా పరిశీలించి, అర్హత ఉంటే ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుందని వివరించారు. వీరికి మే 13న జరిగే ఎన్నికల్లో ఓటువేసే అవకాశం లభిస్తుందని ఏప్రిల్ 14 తరువాత వచ్చే దరఖాస్తులను మాత్రం ఎన్నికల తరువాత మాత్రమే పరిశీలించడం జరుగుతుందన్నారు. వాస్తవానికి నామినేషన్లను దాఖలు చేసేవరకు ఓటు నమోదుకు ధరఖాస్తు చేసేకునే అవకాశం ఉందని, అయితే వచ్చిన వాటిని పరిశీలించి, జాబితాల్లో చేర్చడానికి సమయం పడుతుంది.

➡️