నారాయణపురం వాలంటీర్ల రాజీనామా

Apr 6,2024 13:23 #Eluru district

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు మండలం నారాయణపురం సచివాలయం-2 పరిధిలో వాలంటీర్లు శనివారం మూకుమ్మడిగ రాజీనామాలు చేశారు. తామంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఉంగుటూరు మండలంలో వాలంటీర్ల రాజీనామాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ మండలంలో ఏ గ్రామంలో వాలంటీర్లు రాజీనామాలు చేయకపోవడంటో మిగతా గ్రామాల్లో వాలంటీర్లు ఇదే పంథా అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

➡️