సర్వం సిద్ధం

May 12,2024 21:21

ప్రజాశక్తి-బొబ్బిలి : నియోజకవర్గంలో సోమవారం జరిగే పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నియోజకవర్గంలో 264 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 2,31,232 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 264 పోలింగ్‌ కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.మహిళలదే పైచేయి ఎన్నికల్లో మహిళలదే పైచేయి కానుంది. నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉండటంతో విజేతను నిర్ణయించేది కూడా వారే. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో 2,31,232 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,17,006 మంది ఉన్నారు. పురుషులు 1,14,216 మంది ఉన్నారు.ప్రలోభాలుఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. మున్సిపాలిటీలో ఓటుకు రూ.1,500 ఇవ్వగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి ఇస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇద్దరు కూడా సమానంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతో ఓటర్లు ఎవరు వైపు మొగ్గుచూపుతారోనని చర్చ సాగుతోంది. డబ్బులు పంచడంతో ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు కులం కార్డు ఉపయోగించడం, గతంలో తాము చేసి సహాయాన్ని చెప్పి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలిశృంగవరపుకోట : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని శృంగవరపుకోట మేజర్‌ పంచా యతీ సర్పంచ్‌ జి.సంతోష్‌కుమారి కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఓటు వజ్రం కంటే విలువైనదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవచ్చునని తెలిపారు.ఓటు వేయాలంటే 15 కిలోమీటర్లు వెళ్ళాల్సిందేభోగాపురం: విమానాశ్రయ నిర్వాసిత గ్రామాల ఓటర్లు ఓటు వేయాలంటే 15 కిలో మీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు గ్రామాలకు చెందిన సుమారు 460 మంది ఓటర్లు ఇబ్బంది పడనున్నారు. సంబంధిత పార్టీ నాయకులు మాత్రం వారు వెళ్లేందుకు ఇప్పటికే ఆటోలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా కవులవాడ పంచాయతీలోని మరడపాలెం, బైరెడ్డి పాలెం పంచాయతీలోని ముడసర్ల పేట గ్రామాలను సుమారు 15కిలో మీటర్లు దూరంలో ఉన్న లింగాలవలస కొండపైకి తరలించారు. వీరందరు ఇక్కడ ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఎటువంటి పోలింగ్‌ కేంద్రాలనూ అధికారులు కేటాయించలేదు. దీంతో ముడసర్ల పేట గ్రామానికి చెందిన 60 మంది ఓటర్లు, మరడపాలెం గ్రామానికి చెందిన 400 మంది ఓటర్లు తమ పాత పంచాయతీల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాల్సిన వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. వీరందర్ని ఆటోల్లో తరలించేందుకు నాయకులు సిద్దమవుతున్నారు.

➡️