జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి

Feb 28,2024 10:30 #Jana Sena, #West Godavari District

ప్రజాశక్తి -నరసాపురం: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాదులో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపుకు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సుబ్బా రాయుడు చేరుకుతో పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన సేవలు పార్టీకి ఎంత అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాల్లో సుబ్బారాయుడు అనుభవం జనసేన విజయానికి ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ లో కొత్తపల్లి ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేశారు .ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ కీలకంగా పనిచేశారు. అనంతరం వైసీపీలో చేరారు .ఇటీవల జనసేన చేరుతున్న ప్రకటించి సోమవారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేపథ్యంలో చేరారు.

➡️