జీతాలు ఇవ్వకుంటే బ్రతికేదెలా?

Feb 17,2024 14:23 #vijayanagaram
  •  సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక, హెల్త్ అలవేన్సు , జీతాల బకాయిలు తక్షణమే చెల్లించాలి
  • ఫిబ్రవరి 20న విఎంసి వద్ద ధర్నా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ పంప్ హౌస్, లీకుల్లో పనిచేసే కార్మికులకు నెలలు తరబడి జీతాలు చెల్లించుకుంటే ఎలా బ్రతకాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ &ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు ) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ. జగన్మోహన్రావు అధికారులు ను ప్రశ్నించారు . సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక, బకాయి జీతాలు, హెల్త్ అలవెన్స్ లు, పెండింగ్ జీవోల కోసం ఫిబ్రవరి 20న నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నామని ప్రకటించారు. శనివారం స్థానిక ఎల్ బి జి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రతిరోజు వార్డు సందర్శనలు, శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, విజయనగరం ప్రజలకు త్రాగునీరు అందిస్తూ, పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం 2 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు నేటికీ చెల్లించలేదని, 3 సంవత్సరాల సరెండర్ లీవ్ డబ్బులు బకాయిలు ఉన్నాయని, 2022 బట్టల కుట్టు కులీ, 2023 లో ఇవ్వాల్సిన యూనిఫామ్, చెప్పులు ,నూనెలు, గ్లౌజులు , సబ్బులు నేటికీ ఇవ్వలేదన్నారు.కొత్తవి 200 పుష్కాట్లు ఇవ్వాలని, పాతవి రిపేర్లు చేయాలని డిమాండ్ చేశారు. పంప్ హౌస్ , లీకుల్లో పనిచేసే కార్మికులకు 2నుంచి 6 నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయని, నెలల తరబడి జీతాలు చెల్లించుకుంటే ఎలా బ్రతకాలనిప్రశ్నించారు. రాష్ట్రంలో 16 రోజులు సమ్మె జరిగిందని సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక 1000/- రూపాయలు జీవోలు వచ్చిన కార్మికుల అకౌంట్లో డబ్బులు పడలేదన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్, సెమీ స్కిల్ వేతనాల అమల కోసం రీజనల్ డైరెక్టర్ కి సిపార్సులు చేయాలని, ఆప్కాస్ లో లేని కార్మికులకు థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించాలని, సూపర్వైజర్లకు, కాఫ్ డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 జీతం ఇవ్వాలని, విలీన ప్రాంత కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా విలేకరుల సమావేశంలో రాఘవ, తిరుమల, సతీష్ పాల్గొన్నారు.

➡️