ఇవిఎం స్ట్రాంగ్‌ రూములు తనిఖీ

ప్రజాశక్తి – కడప అర్బన్‌
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఇవిఎం బాక్స్‌లను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న మౌలానా అజాద్‌ ఉర్దూ నేషనల్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతా ఏర్పాట్లను సోమవారం ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి ఎస్‌.ఎస్‌.వి కష్ణారావు, కడప డిఎస్‌పి షరిఫ్‌, ఎఆర్‌ డిఎస్‌పి మురళీధర్‌, డిటిసి డిఎస్‌పి రవికుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పి సుధాకర్‌, రిమ్స్‌ పిఎస్‌ సిఐ కె. రామచంద్ర, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️