కోరంగిలో దాట్ల ముమ్మర ప్రచారం

Apr 28,2024 22:44
మండలంలోని కోరంగి

ప్రజాశక్తి – తాళ్లరేవు

మండలంలోని కోరంగి పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూటమి బలపర్చిన టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. ఆదివారం సీతారాంపురం కాళికాదేవి గుడి వద్ద నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించి మార్గదర్శి వీధి, సీతారాంపురం కాలనీ, దిబ్బలు, మరిడమ్మ అమ్మవారి కాలనీ, ముస్లింల వీధి, సీతారాంపురం మెయిన్‌ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టిడిపి నాయకులు గుత్తుల సాయి, మాజీ ఎంపిపి, జడ్‌పిటిసిలు అనంతలక్ష్మి, రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ కరపత్రాలను అందించారు. మాజీ ఎంపిటిసి వైదాడి శ్రీనివాస్‌, గ్రామ పెద్దలు చెక్క కృష్ణ, పెశింగి ఈశ్వరరావు, పంతాడి ధర్మారావు ఆధ్వర్యంలో చిన్న బొడ్డు, పెద్ద బొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో పలువురు యువకులతో స్కూటర్‌ ర్యాలీ చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా..

మాజీ ఎంపిపి టేకుమూడి అనంతలక్ష్మి, లక్ష్మణరావు దంపతులు ప్రత్యేకంగా మూడు బజాజ్‌ కబ్‌ స్కూటర్లను ప్రచార రథాలుగా సిద్ధం చేశారు. ఆ స్కూటర్లపై మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి బలపర్చిన టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు , టేకుమూడి లక్ష్మణరావు ఎక్కి కోరంగి పంచాయతీలో కాళికాదేవి గుడి వద్ద నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. పొట్టి స్కూటర్లు ఆకర్షనీయంగా ఉండడంతో పలువురు ఆ స్కూటర్ల పైకెక్కి సెల్ఫీలు దిగడానికి కార్యకర్తలు, యువత పోటీలు పడ్డారు.

టిడిపిలో పలువురు చేరిక

మండలంలోని పటవల పంచాయతీకి చెందిన పలువురు టిడిపిలో చేరారు. వీరికి టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భజన సత్తిబాబు, బరుసు పార్థసారథి, దంగేటి అప్పన్న, కొత్తూరు కాశి పాల్గొన్నారు.

➡️