‘నాడు సిద్ధం-నేడు సిద్ధం’ విజయవంతానికి పిలుపు

Jan 25,2024 17:23

వైసిపి కార్యకర్తలతో మాట్లాడుతున్న సూర్యప్రకాష్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం

ఏలూరులో ఈ నెల 30న సిఎం జగన్‌ ఏర్పాటు చేసిన నాడు సిద్ధం-నేడు సిద్ధం అనే కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని రామచంద్రపురం వైసిపి ఇన్చార్జ్‌ పిల్లి సూర్యప్రకాష్‌ పిలుపునిచ్చారు. గురువారం పట్టణ వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు సిద్ధం- నేడు సిద్ధం ” కార్యక్రమం గురించి ఆయన వివరించారు ఈ కార్యక్రమం పై కార్యాచరణ రూపొందించి దాన్ని అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్‌ గాదంశెట్టి శ్రీధర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు, పలువురు నేతలు, కార్యకర్తలు సచివాలయ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.

 

➡️