పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

Mar 23,2024 11:59 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని మున్సిపల్ కమిషనర్ బి.రాము అన్నారు. శనివారం ఉదయం స్థానిక బురుగుంట చెర్వు చుట్టూ ఉన్న వైయస్సార్, ఎన్టీఆర్ పార్కులను డి ఎ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ లావణ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కు పరిసరాలు, చెరువు రేవులు అపరిశుభ్రంగా ఉండడానికి గమనించిన ఆయన అక్కడ పనిచేసే సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. ఎప్పటికప్పుడు పార్కు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందితో కలిసి ఆయన చెత్తను తొలగించారు. పార్కులలో మొక్కల నుంచి వచ్చిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలను వేరు చేయాలన్నారు. రెండింటినీ కలిపి వేయకూడదని పనిచేసే సిబ్బందికి సూచించారు.

➡️