సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు టాలెంట్‌ టెస్టులు

Apr 28,2024 23:13

విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేసిన శేఖరంబాబు, కవిత దంపతులు

ప్రజాశక్తి-గోపాలపురం

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు, వారిలో శక్తి సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు టాలెంట్‌ టెస్టులు ఉపయోగపడతాయని యండపల్లి శేఖరం బాబు అన్నారు. మండలంలోని సగ్గొండ గ్రామ పంచాయతీ, గోపవరంలో ఎంపిపి, ఎంపియుపి, ప్రభుత్వ పాఠశాల కు చెందిన విద్యార్థులు 150 మంది, శ్రీ సాయి విద్యానికేతన్‌ 41 మంది విద్యార్థులకు యండపల్లి రామామణి-వెంకటరత్నం మెమోరియల్‌ టాలెంట్‌ పరీక్షను వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శేఖర్‌ బాబు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్య అనేది బాలల హక్కు అని పిల్లలు క్రమశిక్షణ కలిగిన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. విద్య ద్వారా ప్రతి కుటుంబం తో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. టాలెంట్‌ టెస్టులతో విద్యార్థుల కు ప్రతిభ మెరుగుపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నత చదువు అభ్యసించి శాస్త్రవేత్తలుగా గొప్ప మేధావులుగా ఉన్నత శిఖరాలు అధిరోహిం చాలని ఆకాంక్షించారు. అనంతరం టాలెంట్‌ టెస్ట్‌ రాసిన విద్యార్థులలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతి క్లాసులో 1,2,3 విజేతలను ముగ్గురు చొప్పున ఎంపిక చేసి 24 మందికి ప్రశంస పత్రాలతో పాటు మెమెంటోలు, ట్రోఫీలు, మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేశారు. టాలెంట్‌ టెస్ట్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఎనిమిదవ తరగతి స్కూల్‌ ఫస్ట్‌ వచ్చిన పిట్ట చిన్ని, తొమ్మిదో తరగతి స్కూల్‌ ఫస్ట్‌ వచ్చిన కోడూరి చరణ్‌ తేజకు విద్యార్థులకు ప్రోత్సాహం నింపేందుకు ఎండపల్లి వరలక్ష్మి పేరున హైదరాబాదుకు చెందిన యునైటెడ్‌ కన్స్ట్రక్షన్‌ కంపెనీ వారు బుల్లి రాజు రూ.5000 అందిం చినట్లు తెలిపారు. తల్లిదండ్రుల పేరు మీద మూడు సంవత్స రాలుగా విద్యార్థులకు టాలెంట్‌ టెస్టులు నిర్వహించి బహు మతులు అందజేయడం పట్ల శేఖరం బాబును పెద్దలు అభినంది ంచారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, ప్రముఖులు ఉండవల్లి సత్యనారాయణ, ఖాదర్‌ వలి, సాలి వేణు, యండపల్లి కవిత, మల్లిపూడి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️