పోలింగ్‌ ప్రక్రియపై అవగాహన ఉండాలి

May 5,2024 17:33

జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

సాధారణ ఎన్నికలు 2024 సూక్ష్మ పరిశీలకు లకు పోలింగ్‌ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వీరు పోల్‌ ప్రక్రియను విభిన్న కోణాలలో పరిశీలించాలన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఆపరేషన్‌ అవగాహన ఉండాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు స్వతంత్రం గా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్ని కల నిర్వహణలో చాలా కీలక భూ మిక పోషించాలన్నారు. పరిశీలన వ్యవస్థను బలో పేతం చేసేందుకు, అవసరమైన చోట సూక్ష్మ పరిశీలకు లను నియమించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. సూక్ష్మ పరిశీలకులు సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి ఎన్నికల ఆర్డర్‌ తో పాటు ఫారమ్‌ 12 నింపి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలన్నా రు పోలింగ్‌ ప్రారంభానికి కనీసం 90 నిమిషాల ముందు అంటే మాక్‌ పోల్‌ ప్రారంభమయ్యే సమయంలో సూపర్‌ పరిశీలకులు పోలింగ్‌ స్టేషన్‌లో ఉండాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు.పోలింగ్‌ రోజుకి ఒక రోజు ముందుగా డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో రిపోర్ట్‌ చేయాలని మాక్‌ పోల్‌ సమయంలో పోలింగ్‌ పార్టీతో పాటు ఉండాలని సాయంత్రంలోగా పోలింగ్‌ స్టేషన్‌కు చేరుకోవాలని సూచించడమైనది. సూక్ష్మ పరిశీల కులకు ఫొటో గుర్తింపు కార్డ్‌ ఎంట్రీ పాస్‌ ఇవ్వబడుతుందన్నారు. పోలింగ్‌ సిబ్బందితోపాటు రిసెప్షన్‌ కేంద్రాన్ని తప్పనిసరిగా రావాల్సి ఉంటుంద న్నారు తమ నివేదికను సాధారణ పరిశీలకులకు నివేదించాలన్నారు రిటర్నింగ్‌ అధికారి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు వివిధ అధికారులను కలవాలన్నారు. వెబ్‌ క్యాస్టర్‌లు, వీడియోగ్రాప్లను సూక్ష్మ పరిశీలకుల ను గమనించాలన్నారు పోలింగ్‌ స్టేషన్‌లో హామీ ఇవ్వబడిన కనీస సౌకర్యాల లభ్యతను తనిఖీ చేయా లన్నారు మాక్‌ పోల్‌ సమయంలో సి యు, బి యు, వివి ప్యాట్‌ లతో పోల్‌ నిర్వహించాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులు ఒక మూసివున్న కవరులో సేకరణ కేంద్రంలోని సాధారణ పరిశీలకులకు నివేదికను సమర్పించాలన్నారు.సాధారణ పరిశీలకులు సూక్ష్మ పరిశీలకులు సమర్పించిన నివేదికను పరిశీ లిస్తారన్నారు పోలింగ్‌ ఏజెంట్ల నియమాక పత్రాలను తనిఖీ చేయాలన్నారు. గైడ్‌లైన్‌ ప్రకారం మాక్‌ పోల్‌ సమయంలో నోటా తో సహా అన్ని బటన్‌ను నొక్కడం ద్వారా కనీసం 50 ఓట్లు వేయాలని, మాక్‌ పోల్‌ పూర్తయిన తర్వాత డ్రాప్‌ బాక్స్‌ నుంచి వివి ప్యాట్‌ స్లిప్‌లను బయటకు తీస్తారని పోలింగ్‌ ఏజెంట్ల సంతప్తి చెందిన పిదప సాధారణ పోలింగ్‌కు సిద్ధం కావాలన్నారు. గ్రీన్‌ పేపర్‌ సీల్‌పై ప్రిసైడింగ్‌ అధికారి పోలింగ్‌ ఏజెంట్ల సంతకం చేస్తారన్నారు. మొత్తం పోలింగ్‌ ప్రక్రియపై, పోలింగ్‌ అధికారులు, పోలింగ్‌ ఏజెంట్లపై నిఘా ఉంచి ఓటింగ్‌ సజావుగా జరిగేలా పూర్తి సమన్వయం వహించాలన్నారు . అనుబంధం-28 పోలింగ్‌ రోజున సూక్ష్మ పరిశీలకుల నివేదికగాఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు.

 

➡️