బాధ్యులను కఠినంగా శిక్షించాలి 

Mar 13,2024 12:16 #Konaseema

గీతాంజలి మృతిపై మైనార్టీ బీసీ సంఘం నాయకులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : సోషల్ మీడియా రాక్షసుల ట్రోలింగ్స్ కి మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి మైనార్టీ బీసీ కులానికి చెందిన గీతాంజలి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని మైనార్టీ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెనాలికి చెందిన గీతాంజలి మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తూన్నామని లబ్ధిదారులను కించపరిచే రాజకీయ సంస్కృతి సోషల్ మీడియాలో చూస్తున్నందుకు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న యువత ఉపాధి అవకాశాల కోసం వెతుకులాటకి ఉపాధి మార్గాలకు అన్వేషణకు దారి తీయాలి తప్పా ఇలా సోషల్ మీడియాలో వ్యూస్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మీద ఫోకస్ చేసి వారి ఆత్మ అభిమానానికి భంగం కలిగేలా వ్యవహరించి ఆత్మహత్య చేసుకునేలా ట్రోలింగ్స్ చేయడం దారుణం మని విమర్శించారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించినప్పుడే మిగిలినవారు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఉంటారని, ఇకముందు ఇటువంటివి జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

➡️