గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ 43వ వార్షికోత్సవ వేడుకలు

Mar 29,2024 15:43 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ 43వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాయింట్ డైరెక్టర్, కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వి.పద్మారావు ముఖ్య అతిధిగా పాల్గొనగా పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థి, సి.హెచ్.వి.పార్ధ సారధి, సైంటిస్ట్, ఎస్.ఈ, ఆపరేషన్స్ డైరెక్టర్ ఆదిత్య L1, యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఇస్రో, బెంగళూరు గౌరవ అతిధిగా విచ్చేశారు. తొలుత కార్యక్రమాన్ని ముఖ్య అతిధి, విశిష్ట అతిధులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించగా ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ అద్యక్షత వహించి ప్రిన్సిపాల్ 2023-24 సంవత్సరం లో పాలిటెక్నిక్ జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సాధించిన విజయాలు, వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న విజయాలు వివరిస్తూ విద్యార్దులను అభినందిస్తూ ఉపన్యసించారు. గౌరవ అతిధి పార్థసారథి మాట్లాడుతూ తాను చదివిన కళాశాలకే అథితిగా రావడం ఎంతో ఆనందంగా ఉందని, నేను ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణం ఈ కాలేజీలో చదవడమేనని అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా లెర్నింగ్ టెక్నిక్స్, టైం మానేజ్మెంట్ వంటి విషయాలు తెలుసుకోవాలని మరియు ప్రస్తుతం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రంగం ప్రపంచాన్ని మార్చేస్తుందని, విద్యార్థులందరూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్య అతిధి వి.పద్మారావు మాట్లాడుతూ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలతో తనకు విడదీయరాని బంధం ఉందని, రాష్ట్రంలో వున్న అన్ని గవర్నమెంట్ మరియు ప్రయివేట్ పాలిటెక్నిక్ లలో గుడ్లవల్లేరు కళాశాలకు విశిష్టత ఉందన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే గొప్ప గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, అంతేకాకుండా విద్యార్థులు మొదట క్రమశిక్షణను అలవర్చుకోవాలని అలాంటి విద్యార్థులే గొప్ప స్థాయికి చేరుకుంటారని, అలాగే విద్యార్థులు డిప్లొమా అయిన తరువాత ఉద్యోగాలపై దృష్టి పెట్టినట్లయితే మంచి అనుభవంతో పాటు, ఆదాయము కూడా గడించి ఉన్నత స్థాయికి వెళ్లొచ్చని సూచించారు. ఈ స్థానంలో నిలబడానికి కారణం తన అద్యాపకులు మరియు తల్లి దండ్రులు కారణమని మరియు విద్యను ఒక లక్ష్యంతో అభ్యసిస్తూ అద్యాపకులకు, యాజమాన్య సిబ్బందికి తన కృతఙ్ఞతలు తెలిపింది. అనంతరం 2020-23 సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారిలో బ్రాంచ్ టాపర్స్ 8 మందికి బంగారు పతకాలను అందచేశారు. అలాగే 2023 -ఈసెట్ లో టాప్ ర్యాంకులు సాధించిన 41 మందికి నగదు పారితోషకాలతో ప్రోత్సహించారు. అలాగే 2020-23 లో పాలిటెక్నిక్ విద్యాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ పాలిటెక్నిక్ టాపర్ గా నిలిచిన కుమారి పి.రిషిక, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా , వివిధ స్థాయిల ఆటల పోటిలలో విశేష ప్రతిభ కనబరిచిన పి.స్మైలీ ని పాలిటెక్నిక్ క్రీడా కారిణిగా గుర్తించి జ్ణాపికను ముఖ్య అతిధుల చేతులు మీదుగా అందించారు. అలాగే ద్వితియ మరియు తృతియ సంత్సరాలలో టాపర్స్ గా నిలిచిన వారికి రూ. 35,000/- విలువగల పుస్తకాలను బహుకరించారు.
కార్యక్రమంలో చివరిగా పాలిటెక్నిక్ విద్యార్ధులు ఆటపాటలతో అలరించంగా కార్యక్రమానికి యాజమాన్య సభ్యులు, ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు , వైస్ ప్రెసిడెంట్ కె.వి.కృష్ణ రావు , కో-సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ వి.రామకృష్ణ, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కరుణ కుమార్, ఫార్మసి కాలేజ్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణరావు , ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ ఇంగ్లీష్ మీడియమ్ హై స్కూల్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస మూర్తి, మరియు ఎగ్జిక్యూటివ్ మెంటార్, పాలిటెక్నిక్ విభాగాదిపతులు, అద్యాపకులు మరియు అద్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

➡️