విజయ కాలేజీ విద్యార్థినిల ప్రతిభ

Apr 12,2024 17:21 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో స్థానిక విజయ జూనియర్ కళాశాల విద్యార్థినిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థి కేతేజశ్రీ సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో 1000కి 989 మార్కులు సాధించి కళాశాలలో టాపర్ గా నిలిచారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ కోర్సులో బాస జ్యోత్స్నా 470కి 464 మార్పులు సాధించి కళాశాలలో టాపర్ గా నిలిచారు. కళాశాల సిబ్బంది అభినందించారు.

➡️