ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కర్నూలు బాలోత్సవం

Jan 30,2024 16:17 #balostavalu, #Kurnool
  • లోగో ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్

ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : ఫిబ్రవరి 8,9 తేదీల్లో నిర్వహించనున్న కర్నూలు బాలోత్సవం లోగోను మంగళవారం జిల్లా కలెక్టర్ జి.సృజన ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నంది అవార్డు గ్రహీత బాల ఉత్సవం కమిటీ ఉపాధ్యక్షులు పత్తి ఓబులయ్య కార్యదర్శి జె ఎన్ శేషయ్య ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు పిబీవీ సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు వాసు దేవయ్య సోషల్ మీడియా విభాగం కన్వీనర్ ఎలాగువేరా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ జయరాజు నాయకులు అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ నగర శివారులోని ఇండస్ మాంటిసోరి పాఠశాలలో ఫిబ్రవరి 8 9 తేదీల్లో బాలోత్సవం పండుగను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు

➡️