ఆర్‌డిటి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

Jan 10,2024 20:50

సమావేశంలో మాట్లాడుతున్న సభ్యులు

ప్రజాశక్తి – మంత్రాలయం
మండలంలోని సూగూరు గ్రామంలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌, రీజనల్‌ డైరెక్టర్‌ రామేశ్వరి చేతుల మీదుగా ఆర్‌డిటి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు కుట్టు మిషన్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాజంలో మహిళలు స్వతంత్ర, ఆర్థిక ఎదుగుదలకు టైలరింగ్‌ వృత్తి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బాలికలు అభివృద్ధి చెందాలంటే విద్యావంతులు కావాలని సూచించారు. తల్లిదండ్రులు అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా చదివించి విజ్ఞానాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో ఆర్‌డిటి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన 43 నూతన గృహాలను ప్రారంభించారు. ఎటిఎల్‌ కృష్ణయ్య, ఉప సర్పంచి గోపినాథ్‌, జైభీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ ప్రధాన కార్యదర్శి హనుమన్ను గర్జి, ప్రభాకర్‌, జనార్ధన్‌, సోమన్న పాల్గొన్నారు.

➡️