డిజిటల్‌ విద్య ఘనత జగన్‌దే

Jan 29,2024 19:46

ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న విశ్వనాథ్‌రెడ్డి

– వైసిపి మండల ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌రెడ్డి
ప్రజాశక్తి – మంత్రాలయం

డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిదేనని వైసిపి మండల ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వగరూరు గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయివేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రతిభను కనబరచాలని కోరారు. గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️