బాధితునికి ఆర్థిక సాయం

Jan 6,2024 20:07

ఆర్థిక సాయం అందజేస్తున్న ప్రదీప్‌రెడ్డి

ప్రజాశక్తి – మంత్రాలయం
విద్యుదాఘాతంతో బంకు దగ్ధమై నష్టపోయిన బాధితునికి వైసిపి రాష్ట్ర యువ నేత వై.ప్రదీప్‌ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతంతో ఈడిగ గోపాల్‌ కిరాణషాపు పూర్తిగా కాలిపోయిన విషయం తెలుసుకున్న ప్రదీప్‌ రెడ్డి గ్రామానికి చేరుకుని గోపాల్‌కు ధైర్యం చెప్పి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయంలో గోపాల్‌కు రూ 25 వేల నగదును అందజేశారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. వైసిపి సేవాదళ్‌ నాయకులు బూదూరు లక్ష్మి నారాయణ రెడ్డి, సర్పంచి ముక్కరన్న ఉన్నారు.
ఇచ్చిన మాట మేరకు పింఛను పెంపు
ప్రజాశక్తి – పెద్దకడబూరు
ఇచ్చిన మాట మేరకు పింఛను రూ.3 వేలకు పెంచినట్లు వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. శనివారం పెద్దకడబూరులో ‘గడప గడపకు మనం ప్రభుత్వం’ నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాలు ఎంతవరకు అందాయో తెలుసుకున్నారు. సమస్యలుంటే తమకు తెలపాలని కోరారు. వైసిపి మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ ఎంపిపి రఘురాం, రవిచంద్ర రెడ్డి, నవీన్‌ రెడ్డి, సర్పంచి రామాంజనేయులు, ముక్కరన్న, అర్లప్ప, ఎంపిడిఒ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

➡️