ఐక్యతకు చిహ్నం ఆటలు  

Jan 16,2024 12:20 #Kurnool
games in sankranti festival krnl

ఎంపీపీ వాసు వెంకటేశ్వరమ్మ

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : సమైక్యత భావానికి ఆటలు చిహ్నంగా నిలుస్తాయని కర్నూలు మండల ఎంపీపీ వాసు వెంకటేశ్వరమ్మ అన్నారు. సంక్రాంతి పాటల పోటీల్లో భాగంగా కర్నూలు మండలం ఉలసాల గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమె హాజరయ్యారు. జిల్లాస్థాయి వాటర్ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి కబడి చెట్లు పాల్గొని ఆడడం అభినందనీయమన్నారు. యువత క్రీడల్లో రాణించాలని కోరారు. యువత ఏ దేశ భవితకు పట్టుకొమ్మలని, దేన్నైనా సాధించగల శక్తి వారికి ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ఆడుదామా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పంచలింగాల ఏబీఎం-బి జట్టుతో పాటు, రెండు, మూడు, నాలుగవ స్థానాల్లో నిలిచిన వర్కూరు, పంచలింగాల ఏబీఎం-ఎ, తొలిషాపురం జట్లను ఆమె అభినందించారు. క్రీడల నిర్వహణకు కర్నూలు తాలూకా పోలీసులు భద్రత విధులను నిర్వర్తించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ధర్మవరం వాసు, సర్పంచ్ విద్యాసాగర్ పలువురు క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️