ఆధునిక సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకోవాలి 

Apr 12,2024 17:42 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ప్రజానాట్యమండలి మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకోవాలని మాజీ శాసనసభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్మిక కర్షక భవన్ ప్రాంగణంలో (సర్దార్ హస్మి-డాక్టర్ గరికపాటి రాజారావు) పేరుతో నిర్మించిన ప్రజానాట్యమండలి జిల్లా కార్యాలయాన్ని రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ విద్యావేత్త జి పుల్లయ్య ప్రారంభించారు. మరో ముఖ్య అతిథి మాజీ శాసనసభ్యులు ఎమ్.ఏ. గఫూర్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లలిత కళా సమితి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముందుగా సర్దార్ హస్మి చిత్రపటానికి ముఖ్య అతిథులు, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఎం.పీ. బసవరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా
ఎం .ఏ .గఫూర్ మాట్లాడుతూ కళాకారులకు జిల్లా కార్యాలయం ఉండడం సంతోష కరమైన విషయమని, నూతన నైపుణ్యాలతో కళాకారులను తయారీకి ఈ కార్యాలయం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. నేటికీ కళలకు ఆదరణ ఉందని ప్రజా కళలను పోషించుపోవాల్సిన బాధ్యత కళాకారులు కళా పోషకులపై ఉందని చెప్పారు. సర్దార్ హస్మి వీధి నాటకాలు వేసే వారిని, ప్రజా ఉద్యమాలకు, ప్రజలను చైతన్యం చేయడం కోసం తమ ప్రాణాలను అర్పించారన్నారు. ఆయన జయంతి సందర్భంగా కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో శుభ సూచకమన్నారు. జి. పుల్లయ్య మాట్లాడుతూ ప్రజానాట్యమండలి ఒక చైతన్య స్ఫూర్తి అని అభ్యుదయ సాహిత్యానికి చిరునామాని అది నిరంతరం కొనసాగించాలని అభిలషించారు. ఈ కార్యాలయం కళాకారులకు వేదిక కావాలని కోరారు. వాహీద్ హుస్సేన్, పత్తి. ఓబులయ్య శుభాకాంక్షలు తెలియజేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజలను తెలియజేస్తూ చైతన్యపరచడంలో ప్రజానాట్యమండలికళాకారుల పాత్ర చాలా కీలకమైందని తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ సాంస్కృతికంగా సమాజము పక్కదారి పడుతుందని ఈ సమయంలో అభ్యుదయ కళాకారుల పాత్ర చాలా కష్టతరమైందని, ప్రజానాట్యమండలి బాధ్యతను మరింత పెంచిందని అందరి సహాయ, సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర కార్యాలయం నిర్మాణం కూడా జరుగుతుందని అందుకు కూడా సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించారు. జిల్లా కార్యదర్శి ఈ .నాగరాజు కార్యాలయ నిర్మాణానికి రక రకాలుగా సహాయసకారాలు అందించిన, శారీరక శ్రమను అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు పాటలు పాడి కళాకారుల త్యాగాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు ప్రజానాట్యమండలి గైడర్ పి.ఎస్. రాధాకృష్ణ, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈ. నాగరాజు సహాయ కార్యదర్శి నౌమేశ్వరి, ఏపీ పి.ఎన్.ఎం నాయకులు నాగరాజు” పరుల కోసం పాటుపడని నరుడి బతుకు దేనికని”అంటూ గేయాన్ని ఆలపించారు. శివయ్య, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు జే.ఎన్ .శేషయ్య మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అరుణమ్మ అలివేలు, ప్రజా సంఘాల నాయకులు రాముడు, రాజశేఖర్, రాజగోపాల్, కె. రవి ,సాయిబాబా, గురు శేఖర్ ,వేణమ్మ, లక్ష్మీ, సరిత, అనిత, బాలు, బతుకన్న, సుబ్బరాయుడు, లోకేష్, ఏలియా, జి.బి .మద్దిలేటి రంగస్థలం కళాకారులు గాండ్ల లక్ష్మన్న, రాజశేఖర్, బిసన్న కళాకారులు పాల్గొన్నారు.

➡️