ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతుకు నష్టం

Apr 28,2024 20:53

ప్రజాశక్తి – గుర్ల : ల్యాండ్‌ టైటిల్‌ లింగ్‌ చట్టంతో రైతులకు నష్టం చేకూర్చి ఆ భూములను తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు జగన్‌ మోహన్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారని చీపురపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు అన్నారు. ఆదివారం ఆయన, ఉమ్మడి ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పల నాయుడుతో కలిసి లవిడాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కళా వెంకటరావు మాట్లడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతుల భూములను తన చేతిలోకి తీసుకుని వాటి మీద కూడా అప్పులు వాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాల వెనుకబడిందన్నారు. తనను ఎమ్మెల్యేగా, అప్పలనాయుడును ఎమ్‌పిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, రాష్ట్ర బిసి సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు, టిడిపి జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ తిరుముల రాజు కిరణ్‌ కుమార్‌, టిడిపి మండల అధ్యక్షులు చనమల్ల మహేశ్వర రావు, సర్పంచ్‌ గొర్లె రామలక్ష్మీ, గోవింద్‌, రమణ, పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు.టిడిపితోనే అభివృద్ధి సాధ్యంబొబ్బిలి: టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన, ఎమ్‌పి అభ్యర్ది కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మున్సిపాలిటీలోని 26వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఇద్దరూ ఓట్లను అభ్యర్దించారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఉపాధి లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, బాబు పాలూరి తదితరులు పాల్గొన్నారు.టిడిపిలోకి 70 కుటుంబాలు చేరికమండలంలోని పెంట గ్రామానికి చెందిన 50వైసిపి కుటుంబాలు, ముత్తావలస గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. పెంట ఉపసర్పంచ్‌ చింతల నారాయణరావు, వార్డు మెంబర్‌ తిమనాన సత్యం, మరో 48కుటుంబాలు, ముత్తావలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ బి.ఈశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్‌ జె.నాగభూషణ్‌, మాజీ వార్డు మెంబర్‌ జె. రామారావుతో పాటు మరో 16మంది బేబినాయన సమక్షంలో పార్టీలో చేరారు.వైసిపి అరాచకాలపై చార్జ్‌ షీటు విడుదలకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా ఆదివారం వైసిపి అరాచకాలపై చార్జ్‌ షీటును విడుదల చేశారు. పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసం, రాష్ట్రంలో ప్రజల జీవితాలు అగమ్యగోచరం, మద్యం రేట్లు పెంచి లక్ష కోట్లు దోపిడి పదిసార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై 75 వేల కోట్ల భారం వేసిన అంశాలను ఈ చార్జ్‌ షీట్‌లో పొందిపరిచినట్లు చెప్పారు.ప్రజలను మోసం చేసిన వైసిపిగంట్యాడ: వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అటువంటి పార్టీకి బుద్ది చెప్పాలని టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం సిరిపురం, మోకాలపాడు, రామభద్రపురం, వసాది, బోనంగి, కొట్టారు బిల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి జగన్‌ ప్రజలను మోసం చేశారన్నారు. ఐదేళ్ల కాలంలో ఎక్కడా ఒక అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. మే 13న జరిగే ఎన్నికలలో ఎమ్‌పి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడుకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 240 కుటుంబాలు టిడిపిలో చేరికసిరిపురం గ్రామంలో ఆకిరి శ్రీనివాసరావు సమక్షంలో 100 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. కొట్టారుబిల్లి గ్రామంలో సూర్యనారాయణ, వెంకటరావు, దేవుడు సమక్షంలో 50 కుటుంబాలు, బోనంగి దాడి చెరువు కల్లాకు చెందిన 90 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కొండపల్లి భాస్కరనాయుడు, మాజీ జెడ్‌పిటిసి కొరుపోలు రమేష్‌ కుమార్‌, రంది రాము, అల్లు విజరు, రంది చిన్న రామునాయుడు, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.జామి: టిడిపి అధికారంలోకి వస్తే సమస్యలు పరుస్కారమవుతాయని గజపతినగరం టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం లోట్లపల్లిలో మండల అధ్యక్షులు స్వామినాయుడు ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ పర్యటించారు. టిడిపికి ఓటు వేసి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం కుమరాం గ్రామంలో పలువురు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ధనియాలా పైడిరాజు, సూర్యారావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.గొల్లపేటలో 30 కుటుంబాలు టిడిపిలో చేరికరామభద్రపురం: మండలంలోని గొల్లలపేటలో 30 కుటుంబాలు వైసిపిని వీటి టిడిపిలో చేరాయి. జిల్లా బిసి సెల్‌ ఉపాధ్యక్షులు కర్రోతు తిరుపతిరావు ఆధ్వర్యంలో వీరంతా టిడిపి జోనల్‌ కోఆర్డినేటర్‌ -2 సుజయకృష్ణ రంగారావు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ తామంతా వైసిపిని వీడామన్నారు. బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి బేబీనాయన విజయానికి తామంతా ఐకమత్యంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపా ధ్యక్షుడు మడక తిరుపతినాయుడు, కర్రోతు వెంకన్న, ఉపసర్పంచ్‌ అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️