ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు

Mar 28,2024 18:26

మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి

ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా?
అక్కా చెల్లెమ్మ ముఖాలలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది
చేసిన మంచిని చూసి ఓటు వేయండి
రైతులు, మహిళల ముఖాముఖిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
రానున్నవి ప్రజల తలరాతలు మార్చే ఎన్నికలని, ఇంతకాలం పని చేసిన ముఖ్యమంత్రులకు, ఈ ఐదేళ్లలో జరిగన పనులకు బేరీజు వేసుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సిఎం జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం యాత్ర’ రెండో రోజు ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తులూరు గ్రామాల మీదుగా ముఖ్యమంత్రి యర్రగుంట్లకు చేరుకున్నారు. అక్కడ ప్రజలు, మేధావులతో ముఖాముఖి సమావేశం ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలలో వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత నాకంటే ముందు చాలామంది సిఎంలు పనిచేశారని, 75 ఏళ్ల ముసలాయన పరిపాలన చూశారని, ఆయన 14 ఏళ్లు సీఎంగా పని చేశారని అన్నారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనకు ఉందని, నేను చాలా చిన్నవాడిని, వయసులో కూడా చిన్ననే. ఇంత చిన్నొడు చేసిన పనులు ఎర్రగుంట్ల గ్రామంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తులు మీ గ్రామంలో చేశారా? ప్రజలు కూడా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. యర్రగుంట్ల పరిధిలోని రెండు సచివాలయాల పరిధిలో 1492 గృహాలు ఉన్నాయన్నారు. అందులో 1391 గృహాల వారు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారన్నారు. వివిధ పథకాల ద్వారా రూ.48. 74 కోట్లు అందించామన్నారు. ఒక్క ఎర్రగుంట్ల గ్రామానికి అమ్మఒడి కింద 1,043 మంది తల్లులకు రూ.4.59 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా కింద రూ.3 కోట్లకు అందంచాం. ఆరోగ్యశ్రీకంద రూ.2 కోట్లకు పైగా అందించామని, చేదోడు పథకం కింద రూ.31.20 లక్షలు అందించామన్నారు. ఎర్రగుంట్ల గ్రామంలో 93.06 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశానన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఎక్కడా లంచాలు లేవు … వివక్ష లేదన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడు జరగని విధంగా సంక్షేమం. అభివృద్ధిని 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలను మార్చామన్నారు. నాడు నేడు పనుల కింద ఆస్పత్రులను అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం సిబిఎస్‌ఇ, ఐబి వంటి అంతర్జాతీయ స్థాయి బోధన, డిజిటల్‌ బోధన వంటివి ఒక్కసారి పాఠశాలల్లో కూర్చొని చూస్తే గుర్తుకొచ్చేది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే అన్నారు. ఇటీవల ఇబిసి, వైఎస్‌ఆర్‌ చేయూత సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కామన్నారు. డబ్బులు పది రోజులు అటు ఇటుగా బ్యాంకులలో పడతాయన్నారు. అక్కా చెల్లెమ్మలకు, రైతన్నలకు అండగా నిలిచింది వైసిపి ప్రభుత్వమే అన్నారు. ఈ రోజు అక్కాచెల్లెమ్మల ముఖాలలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుందన్నారు. మీ బిడ్డ పాలనలో మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించాలన్నారు. మీరు ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండన్నారు. ఒకసారి ఓటువేసే సమయంలో ఆలోచన చేయండన్నారు. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్‌ కోసమే వేస్తున్నామని, ఏమ్మెల్యేకో, ఎంపీకో కాదు మీరు ఓటు వేసేది..మన తలరాతలు మార్చే ఎన్నిక అన్నారు. అనంతరం ప్రజలు మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది సంక్షేమం, సుపరిపాలనలో చేకూర్చిన మేలును వివరించారు. వైసిపి హాయంలో రైతులకు, మహిళలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఎర్రగుంట్ల గ్రామానికి సిీఎం ఎంతో చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, రాష్ట్ర జల వనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, సర్పంచి , ఎంపిటసి తదితరులు పాల్గొన్నారు.రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఆశీర్వదించండి: రానున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. యర్రగుంట్ల ప్రజలు మేధావుల ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ 45 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. జిమ్మిక్కులు చేసేవారు, పగటివేషగాళ్లు మీ దగ్గరికి వస్తున్నారన్నారు. ఎర్రబుక్కుంది పేర్లు రాసుకుంటున్నామని ఒకరంటున్నారని.. మరొకరు మా ప్రభుత్వం వస్తే గుళ్ళల్లో బళ్ళల్లో దాక్కోవాలని చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎగిరేది వైసిపి జెండానే ఆని, మీ ప్రభుత్వం రానున్నదన్నారు. మంచి జరిగింది కాబట్టి రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలన్నారు.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్‌ కాన్వారు: సీఎం జగన్‌ యాత్ర రెండో రోజు ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆళ్లగడ్డ నుంచి యర్రగుంట్లకు వస్తుండగా బత్తులూరు గ్రామం వద్ద అంబులెన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో అంబులెన్స్‌కు దారి ఇచ్చి ముఖ్యమంత్రి తన ఉదారతను చాటుకున్నారు. కింద కూర్చుని దివ్యాంగులతో ఫోటో దిగిన సీఎం జగన్‌ : మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్లలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దివ్యాంగ దంపతులు ప్రసాద్‌ , అపర్ణలు సీఎంతో ఫోటో కావాలని అడగగా సీఎం కింద కూర్చుని ఫోటో దిగి వారి ముచ్చట తీర్చారు. అలాగే ప్రసాద్‌ మిమిక్రీ ద్వారా జగన్‌ ను ఇమిటేట్‌ చేశాడు. ప్రసాద్‌ మిమిక్రీకి ఫిదా అయిన సీఎం ముసి ముసి నవ్వులు చిందించారు.

➡️