ఉపాధ్యాయుల రక్తదానం

May 9,2024 21:43

యుటిఎఫ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి సుందరరావు ప్రథమ వర్థంతి సందర్భంగా

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : యు.టి.ఎఫ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఉద్యమ నాయకులు, ఏ.కష్ణ సుందరరావు ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం పలువురు ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. యుటిఎఫ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యుటిఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఏ.సుందరయ్య ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా సుందరయ్య మాట్లాడుతూ యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో ఈ రక్తదానం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి.మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ కృష్ణ సుందరరావు సర్వీస్‌ మొత్తం యు.టి.ఎఫ్‌ సంఘంలో పలు బాధ్యతలు నిర్వహించి సంఘానికి విశేష కృషి చేశారని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి కె.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సుందరరావును స్మరించుకుంటూ యుటిఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్త దానం శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రచురణ కమిట్‌ కన్వీనర్‌ శ్రీ ఎం. హనుమంతు రావు, రాష్ట్ర పూర్వ కోశాధికారి కె.సంజీవ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.సుందరయ్య మాట్లాడుతూ నూజివీడు ప్రాంతంలో యుటిఎఫ్‌ సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. వారిలో రక్త దానం చేయుటకు అర్హత కొంత మంది పొంది దానం చేసిన వారి లో పి.లీల, ఏ.అనంత్‌ కుమార్‌, ఎం.రత్న కమల్‌ బాబు, వి.వసంత రావు, జి.లక్ష్మీ నారాయణ, పి.కారుణ్య దేవ, బి.శిరీష్‌ బాబు, ఏ.కిరణ్‌, తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కె శ్రీనివాస రావు అధ్యక్షత వహించగా ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఏ.సుందరయ్య ఎన్టీఆర్‌ జిల్లా సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య, జిల్లా కోశాధికారి శ్రీ పి.నాగేశ్వర రావు, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఏ.గోపాల కృష్ణ, జిల్లా కార్యదర్శి ఏ.అనంత్‌కుమార్‌, బి.రమణయ్య, డి.హరి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️