Apr 8,2024 21:50

ఎన్నికల సెక్టార్‌ అధికారులతో ఆర్‌డిఒ సమీక్షప్రజాశక్తి – నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి నందిగామ రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎ.రవీంద్రరావు కెవిఆర్‌ కాలేజ్‌లో సోమవారం ఎన్నికల విధి నిర్వహణ గురించి సెక్టార్‌ రూట్‌ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెక్టార్‌, రూట్‌ అధికారులు చేయబోయే కర్తవ్యాలు, మాక్‌ పోల్‌ గురించి, పిఒ డైరీ గురించి, ఇవిఎంల గురించి వివరించారు. రూట్‌ అధికారులు వారికి కేటాయించిన రూట్లను జాగ్రత్తగా చూసుకొని విధిగా పాటించాలని తెలిపారు. పిఎల విధుల గురించి కూడా వివరించారు. చివరగా అందరూ సెక్టార్‌ , రూట్‌ అధికారులతో ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌ గురించి పూర్తి అవగాహనా కల్పించారు. పోలింగ్‌ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశం లో నందిగామ తహశీల్దార్‌ వై.సరస్వతి, తహశీల్దార్‌ వి.సుస్వాగతం, వీరులపాడు తహశీల్దార్‌ కె.రాజ కిషోర్‌, చందర్లపాడు తహశీల్దార్‌ జీ.మురళీధర్‌, అసెంబ్లీ స్థాయి సెక్టార్‌ అధికారులు, రూట్‌ ఆఫీసర్స్‌ పాల్గొన్నారు.

➡️