సమ్మె ఫలితమే డ్రైవర్లకు అక్యుపెన్స్‌ అలవెన్స్‌..

Jan 2,2024 16:06 #vijayanagaram
  • అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను కొనసాగిస్తాం
  • మున్సిపల్‌ ఆఫీస్‌ నుంచి ప్రదర్శన, గంటస్తంభం వద్ద మానవహారం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు అనుబంధం మున్సిపల్‌ కార్మిక మున్సిపల్‌ కార్మిక సంఘం తలపెట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ఉధృతం అవుతున్న నేపథ్యంలో 3వసారి ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఉమామహేశ్వరరావు నాయకత్వంలో వెలగపూడి సచివాలయంలో మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, డిఎంఎ అధికారులతో జరుగుతున్న చర్చలు విజయవంతం కావాలనీ ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జగన్మోహనరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.వి.రమణ, నగర కార్యదర్శి బి.రమణ, ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు ఆకాంక్షించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభించి గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మె ఫలితంగానే చెత్త తరలించే వాహనాల డ్రైవర్లకు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కార్మికులకు 6 వేలు అక్యుపెన్ష్‌ అలవెన్స్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చిందని, ఇది మున్సిపల్‌ కార్మికుల మొదటి విజయమని, ఇందులో పార్కుల్లో పనిచేసే కార్మికులును కూడా చేర్చాలని పర్మినెంట్‌, సమాన పనికి సమాన వేతనం, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌ , పంప్‌ హౌస్‌, విలీన ప్రాంత కార్మికులకు ఆప్కాస్‌ జీతాలు, టర్న్‌ కి సిస్టం రద్దు, పర్మినెంట్‌ కార్మికులకు సరెండర్‌ లీవ్‌ డబ్బులు చెల్లింపు, సిపిఎస్‌ రద్దు, 3 నెలలు బకాయి హెల్త్‌ అలవెన్స్‌ తదితర సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని, విజయనగరం కార్పొరేషన్‌ కార్మికులు సమ్మెకు లో పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కే త్రినాధ్‌, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు భాస్కరరావు, రజిని, కృష్ణ, రామచంద్రరావు, ఆదినారాయణ, చందర్రావు, పైడ్రాజు, కుమారి,రమా,రాఘవ, లక్ష్మణరావు, అశోక్‌, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️