జొన్నాడలో పెట్రోల్ బంకు ప్రారంభం

May 6,2024 19:07 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని జొన్నాడ ఆంజనేయ స్వామి గుడి సమీపాన జాతీయ రహదారి ప్రక్కన సోమవారం పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ సంస్థ అనుబంధం సూర్య ఫ్యూయల్ స్టేషన్ను జొన్నాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి ఏర్పాటు చేయగా స్థానిక ప్రముఖ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ద్వారంపూడి అప్పారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. దీంతో చుట్టుపక్కల పలువురు రైతులు ఫ్యూయల్ స్టేషన్ మరింత దగ్గరగా అందుబాటులోకి తీసుకు రావడంతో వ్యాపారిని అభినందించారు. అలాగే పలువురు ప్రముఖులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️