ఆస్తి కోసం హత్య

Feb 21,2024 16:21 #brutally murder, #palnadu district
Murder for property

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో 12వ సచివాలయం దగ్గర వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. వివరాల్లోకి వెళితే… కొంతకాలంగా ఆస్తి కోసం పెంచిన తల్లిదండ్రులతో కొడుకు వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య చేసినట్లు సమాచారం. మచ్చు యోహాను(64),   చిట్టెమ్మ(56) దంపతులు పెంచుకున్న కొడుకే వారిని ఆస్తి కోసం ఈ ఘతకానికి పాల్పడ్డాడు. దాడిలో యోహాను మృతి చెందగా,  చిట్టెమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.  సంఘటన స్థలానికి చేరుకున్న గురజాల డి ఎస్ పి.పల్లం రాజు మరియు పిడుగురాళ్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి ఆంజినేయులు, సబ్ ఇన్స్పెక్టర్ అమీర్ లు విచారణను ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️