ముమ్మరంగా పోలింగ్‌ ఏర్పాట్లు

May 11,2024 23:54 #Bhemili, #Polling, #Ready
Bheemili Ready to poling

ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : నియోజకవర్గంలో పోలింగ్‌ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగనుంది. 348 పోలింగ్‌ కేంద్రాల్లో పిఒలు, ఎపిఒలు తదితరులు సుమారు 2,565 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. 800 ఓటర్లు పైబడిన పోలింగ్‌ కేంద్రాలకు ఆరుగురు, 800 పోలింగ్‌ కేంద్రాలలోపు ఉన్న వాటికి ఐదుగురు చొప్పున సిబ్బందిని నియమించారు. 1200 ఓట్లు దాటిన 220 పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ విధానం అమలు చేయనున్నారు. 86 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఓటర్లు 3,63,013 జిల్లాలోనే అత్యధిక మంది ఓటర్లు ఉన్న నియోజక వర్గం భీమిలిలో 3 లక్షలా 63 వేలా 13 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,84,908 మంది, పురుషులు 1,78,090 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు.మండలాల వారీగా ఓటర్లు.. పద్మనాభం మండలంలో మొత్తం ఓటర్లు 42,145 మంది ఉండగా ఇందులో మహిళలు 21,521 మంది, పురుషులు 20,624 మంది ఉన్నారు. ఆనందపురం మండలంలో మొత్తం ఓటర్లు 51,354 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 25,993 మంది, పురుషులు 25,361 మంది ఉన్నారు. భీమిలి మండలంలో మొత్తం ఓటర్లు లక్షా 24 వేలా 20 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 52,518 మంది, పురుషులు 49,899 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. విశాఖ రూరల్‌ మండలంలో మొత్తం ఓటర్లు లక్షా 67 వేలా 94 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 84,876 మంది, పురుషులు 82,206 మంది, ఇతరులు 12 మంది ఉన్నారుమండలాల వారీగా పోలింగ్‌ కేంద్రాలు.. పద్మనాభం మండలంలో 1 నుంచి 45 పోలింగ్‌ కేంద్రాలు, ఆనందపురం మండలంలో 46 నుంచి 102 పోలింగ్‌ కేంద్రాలు, భీమిలి మండలంలో 103 నుంచి 207 పోలింగ్‌ కేంద్రాలు, విశాఖ రూరల్‌ మండలంలో 208 నుంచి 348 వరకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.భీమిలి బరిలో 15 మంది శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో భీమిలి బరిలో 15 మంది ఉన్నారు. ఇందులో టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు, వైసిపి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్డాల వెంకట వర్మరాజు, చోడిపల్లి రాజు (ఎస్‌పి), భాగం గోపాలరావు (బిఎస్‌పి), కోలా హరిబాబు (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), ఇల్లిపిల్లి అనిల్‌ కుమార్‌ (జై భారత్‌ నేషనల్‌ పార్టీ), గంటా శ్రీనివాసరావు (జాతీయ జనసేన పార్టీ), ఇండిపెండెంట్లుగా నూకల సూర్య ప్రకాష్‌, మేకా సత్యకిరణ్‌, చొప్పల్లి శరవన్‌ గణేష్‌, బావిశెట్టి రమణ బాబు, బుగత రాము, నాగోతు నాగమణి, నందికోళ్ల సంధ్య పోటీలో ఉన్నారు.పకడ్బందీగా ఏర్పాట్లు ఆనందపురం: సార్వత్రిక ఎన్నికలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు మండల ఎన్నికల అధికారి హేమంత్‌ కుమార్‌ తెలిపారు. మండలంలో 57 పోలింగ్‌ కేంద్రాలలో 50,582 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రతి కేంద్రం వద్ద టెంట్లు ఏర్పాటుచేస్తున్నామని, మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సిఐ టివి.తిరుపతిరావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శనివారం సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ ప్రచారం చేయకూడదని చెప్పారు. 13వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఇతర అడ్డంకులు కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పోలింగ్‌ బూత్‌లు, పరిసర ప్రాంతాలలో సిసి కెమెరాలు, బాడీవార్న్‌ కెమెరాలు వినియోగించి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు.

➡️