నవతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజు

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : పట్టణానికి చెందిన నందికోళ్ళ.రాజుకు నవతరం పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ ప్రకటించింది. ఈ మేరకు రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ … తనకు టికెట్‌ వచ్చిన విషయాన్ని తెలిపారు. ఇప్పటికే తాను నవతరం పార్టీ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నానని తన సేవలను గుర్తించి రేపు జరగబోయే ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చినట్టు చెప్పారు. నవతరం పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడే పార్టీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కఅషి చేసి ప్రజలకు అండగా నిలిచేదే నవతరం పార్టీ అన్నారు. రేపటి నుంచి భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ కార్యకర్తలతోను, అభిమానులతోను సమీక్షలు జరిపి ప్రణాళిక సిద్ధం చేస్తానన్నారు.

➡️