కళ్యాణమస్తు, షాదీతోఫా సాయం అందజేత

కళ్యాణమస్తు, షాదీతోఫా సాయం అందజేత

కళ్యాణమస్తు, షాదీతోఫా మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ తదితరులు

       పుట్టపర్తి అర్బన్‌ : వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా జిల్లాలో మొత్తం 329మందికి రూ.2.35 కోట్ల సాయాన్ని అందజేసినట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. గురువారం ఉదయం వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని పుట్టపర్తి కలెక్టరేట్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జూలై- సెప్టెంబర్‌ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి కళ్యాణమస్తు, షాదీతోఫా సొమ్మును జమ చేశారన్నారు. ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రాబోయే రోజుల్లో అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు.

➡️