నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

Nov 27,2023 21:44

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు, నిరుపేదలు

          గోరంట్ల రూరల్‌ : 90 రోజుల్లో ఇళ్లు పథకం కింద నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు పెద్దన్న డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన 150 మంది నిరుపేదలతో కలసి మండల పరిధిలోని పాలసముద్రం గ్రామ సచివాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా పెద్దన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడా కూడా స్థలాలు కేటాయించలేదని విమర్శించారు. పాలసముద్రం గ్రామంలోనే ఇళ్లు లేని పేదలు 150 మంది గృహాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. వీరందరికీ తక్షణం ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, నిరుపేదలు పాల్గొన్నారు.

➡️