ప్రతి ఇంటికి తాగునీరందిస్తాం : ఎమ్మెల్యే కేతిరెడ్డి

Feb 20,2024 21:35

తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

                          ధర్మవరం టౌన్‌ : జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పోతులనాగేపల్లి లేఅవుట్‌లోని జగనన్న హౌసింగ్‌ కాలనీలో జలజీవన్‌ మిషన్‌ పథకం కింద రూ.7.35 కోట్లతో చేపట్టిన రక్షిత తాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు గత టీడీపి.హాయాంలో ధర్మవరం ప్రాంతంలో నీటి కోసం ట్యాంకర్ల వద్ద మహిళలు కొట్టుకున్న సందర్భాలను చూశామన్నారు. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తరువాత ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రషీద్‌ ఖాన్‌, డీఈ శాంతన్న, ఏఈ ప్రసాద్‌, హౌసింగ్‌ఏఈ బాలాజీ, పోతులనాగేపల్లి సర్పంచి మౌనికారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ వేముల జయరామిరెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డిబాలిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రంశీన, కౌన్సిలర్లు మాసపల్లి సాయి,చందమూరి నారాయణరెడ్డి, పెనుజూరి నాగరాజు, కడప రంగస్వామి,మేడాపురం వెంకటేశులు, గోరగాటి పురుషోత్తంరెడ్డి, నాయకులు సానే నరసింహారెడ్డి, చాంద్‌బాషా, ఉడుముల రాము, తోపుదుర్తి వెంకటరాముడు, తీర్థాల వెంకటరమణ స్వామి, అమీర్‌బాషా, పోతులనాగేపల్లి వెంకట్రామిరెడ్డి, నర్సిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️